
కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈ చిన్నది తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రష్మికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
తాజాగా రష్మీ రాజమండ్రి గోదావరి నదిలో అస్తికలు కలుపుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. నన్ను క్షమించు జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అంటూ రష్మీ ఆ వీడియో కింద రాసుకోచ్చారు. దీంతో రష్మి కలిపిన ఆస్తికలు ఎవరివా అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. అయితే ఆ ఆస్తికలు రష్మీ పెంపుడు కుక్క చుట్కీవి. సాధారణంగా కుటుంబ సభ్యులు చనిపోతే ఆస్తికలను పుణ్య నదులలో, సముద్రాలలో కలుపుతూ ఉండడం సాంప్రదాయం. కానీ రష్మి తన పెంపుడు కుక్క చుట్కి ఆస్తికలను నదిలో కలిపారు.
అంతేకాకుండా చుట్కీ మరణం పట్ల రష్మీ చాలా బాధతో ఉన్నారు. ఇవి ఇంకా రష్మీకి కొంతమంది అభిమానులు సానుభూతిని తెలియజేస్తున్నారు. జీవితంలో ఎప్పుడు ఎవరు ఎవరికి తోడుగా ఉండరు. ఏదో ఒక సమయంలో తోడును తప్పకుండా కోల్పోవాల్సి వస్తుంది. అది మనుషులు అయినా పెంపుడు జంతువులు అయినా ఒకటే అని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.