
కానీ ఎవరు ఒప్పుకోకపోవడంతో మురళి మోహన్ స్వయంగా కృష్ణ వద్దకు వెళ్లి సినిమా చెయ్యమని రిక్వెస్ట్ చేశారట. ఆ తర్వాత కృష్ణ క్యారెక్టర్ లో చిన్న చిన్న మార్పులు చేసి మళ్లీ కథను వినిపించారు .. ఇక అప్పుడు కృష్ణ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు .. ఇక ఈ సినిమాలో నాగార్జున , కృష్ణకు కొడుకుగా కాలేజీ స్టూడెంట్ గా నటించారు .. అలాగే తండ్రి అంటే అసలు నచ్చని పాత్ర నాగార్జునది . ఇక ఇవీవీ సత్యనారాయణ మార్క్ కామెడీ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . అయితే క్లైమాక్స్లో చిత్ర యూనిట్ కి లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టాయి .. క్లైమాక్స్ లో నాగార్జున , కృష్ణ ని తిడుతూ కాలర్ పట్టుకుని సన్నివేశం ఒకటి ఉంటుంది .. ఇక దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కృష్ణ అభిమానులు థియేటర్స్ వద్ద గొడవలు కూడా చేశారు .. అలాగే కృష్ణుని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని లేకపోతే వారసుడు సినిమాను అడ్డుకుంటామని ప్రకటనలు కూడా చేశారు.
ఇక దాంతో స్వయంగా నాగార్జున ఇవివి సత్యనారాయణ రంగంలోకి దిగి వారికి క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే కృష్ణ అంటే ఎంతో గౌరవం అని ఆ సన్నివేశం వల్ల ఇంత గొడవ అవుతుందని ఊహించలేదని కూడా చెప్పారు . దాంతో సినిమా ప్రింట్స్‌ను మొత్తం వెనక్కి తీసుకొని క్లైమాక్స్ ని మళ్ళీ షూట్ చేసి సినిమాని మరోసారి రిలీజ్ చేశారు .. అలా మొదటి వారం ఈ సినిమా కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది .. అలాగే ఈ సినిమా ఫుల్ రన్ లో ఐదు కోట్లకు పైగా రాబట్టింది . అలాగే ఈ సినిమా 100 రోజులు వేడుక ఎంతో గ్రాండ్గా జరిగింది . అలాగే అదే సమయంలో కృష్ణ తాను అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో నటిస్తే ఏమవుతుందో ఊహించని కృష్ణ .. ఇకపై అలాంటి సినిమాల్లో నటించనని కూడా సంచల నిర్ణయం తీసుకున్నారు.