
అయితే ఈ సినిమాని మహాభారతం ఆధారంగా తెర్కక్కించబోతున్నారట ప్రశాంత్ వర్మ .. మహాభారతంలోని బకాసురుడు క్యారెక్టర్ని ప్రధానంగా ఈ సినిమాలో తీసుకురాబోతున్నారట .. బకాసురుడు రాక్షసుడు మరి ఆయన కథతో ఎలాంటి సినిమా చేస్తారనేది ఇప్పుడు అందరిలో ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే ఇందులో ప్రభాస్ బకాసురుడు లాంటి విలన్ తరహా క్యారెక్టర్ లో కనిపిస్తాడా అనేది కూడా అందరిలో కొంత ఆసక్తిగా కనిపిస్తుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లీక్ అయింది .. బకాసురుడు క్యారెక్టర్ ఆధారంగా వచ్చే సినిమా కావడంతో దీనికి బక అనే పేరును అనుకుంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి . ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైర్లుగా మారింది . అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది ..
ఇక ప్రభాస్ పాత్రకి సంబంధించి ఇప్పటికీ అభిమానులు సరికొత్త డౌట్స్ వస్తున్నాయి .. ఇందులో హీరో నెగటివ్ షేడ్ లో ఉన్న పాత్రలో కనిపిస్తాడని సందేహాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నారని కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు . ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీలో నటిస్తున్నాడు ఈ సినిమా కు మరో 10 శాతం షూటింగ్ మూడు పాటలు బాలన్స్ ఉన్నాయి .. అలాగే హనురాగపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమా చేస్తున్నాడు .. ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .. ఆ తర్వాత ప్రభస్ సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా ఉండబోతుంది .. అలాగే సలార్ 2 , కల్కి 2 కంటే ముందే ఈ సినిమా రానుందట .. ఆ తర్వాత ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి .. వీటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభస్ హీరోగా దిల్ రాజు ఓ భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు .