మ్యాన్ ఆఫ్ మాస‌స్ ఎన్టీఆర్ కు దేవర‌ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో వరుస‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు .. ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలు రెడీ గా ఉన్నాయి .. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం లో ఓ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది .. సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే .. అలాగే హృతిక్ రోషన్ తో వార్‌ 2 లో కూడా నటిస్తున్నాడు .. అయితే మరోవైపు ఎన్టీఆర్ కోసం మరో కొత్త స్టోరీలు కూడా రెడీ కాబోతున్నాయి ..
 

డాక్టర్ , జైలర్ సినిమాల దర్శకుడు నెల్సన్ ఎన్టీఆర్ కోసం భారీ స్క్రిప్టు ను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే . జైలర్ 2 పనుల్లో బిజీ గా ఉన్న నెల్సన్ ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా ని లైన్లో పెట్టడానికి రెడీ అవుతున్నాడు .. అయితే ఈ సినిమా కోసం రాక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడు .. ఏ టైటిల్ పెట్టిన అది పాన్ ఇండియా ప్రేక్షకుల ని దృష్టి లో ఉంచుకొని పెట్టాల్సిందే .. రాక్ అయితే అందరికీ అర్థమవుతుందని ఉద్దేశం తో నెల్సన్ ఈ టైటిల్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది .


సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తీసుకురాబోతున్నారని తెలుస్తుంది .. నాగ‌ వంశీ నిర్మాతగా 2026 లో ఈ సినిమా షూటింగ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది .. నెల్సన్ యాక్షన్ సినిమాలను ఎంతో స్టైలిష్ గా తీర్చిదిద్ద‌గ‌ల‌డు . అలాగే ఆయన సినిమాలలో కామెడీ సెన్స్  కూడా బాగా ఉంటుంది .. రెండు మిక్స్ చేసి రాక్ స్టోరీ ని తీసుకురాబోతున్నాడట .. ఈ సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలో నే బయటకు రాబోతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: