తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అశ్విత్ మరిముత్తు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే హిందీ లో కూడా విడుదల చేయనున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మార్చి 14 వ తేదీన హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే తమిళ్ , తెలుగు , మలయాళ భాషల్లో విడుదల అయ్యి మూడు భాషల్లో కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమాను మార్చి 14 వ తేదీన హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో లాభాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం కూడా ఈ సినిమా రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబడుతూ ముందుకు ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: