కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ... దేవ్ గిల్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

ఇకపోతే ఈ సినిమాలో శ్రీహరి , సలోని ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఇంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాలో సలోని పాత్రకు మొదట ఆమెను కాకుండా మరో ముద్దుగుమ్మను అనుకున్నారట. అందులో భాగంగా ఆ బ్యూటీని సంప్రదించగా ఆమె మాత్రం ఆ సినిమాలో నటించను అని చెప్పిందట. ఇంతకు ఆమె ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి అర్చన ను మగధీర సినిమాలో సలోని పాత్ర కోసం మొదటగా సంప్రదించారట.

ఈమె మాత్రం ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదట. దానితో ఆ పాత్రలో సలోని ని తీసుకున్నారట. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా సలోని కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న సినిమాలో కూడా సలోని హీరోయిన్గా కూడా నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమె క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో మరింతగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: