చిత్ర పరిశ్రమ లో హీరోయిన్లది ఊహించని వింత లైఫ్ అనుకోవాలి .. ఎందుకంటే ఒక హీరోతో హీరోయిన్గా నటించిన హీరోయిన్లు మళ్లీ వారి తండ్రులకు కూడా హీరోయిన్గా నటించాల్సిన పరిస్థితులు ఉంటాయి .. ఇలాంటి వింత  సిశ్చూవేషన్ ను అయితేనే ఫేస్ చేసిన హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే అలా తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లలో ఇద్దరికి న్యాయం చేసిన వారు మాత్రం చాలా అరుదు .. కాజల్ , తమన్నా ,, నయనతార , రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు తండ్రి కొడుకులు ఇలా ఇద్దరు హీరోలతో విజయాలు అందుకున్నారు. కాని జంటగా సినిమాలు చేసిన వారిలో కాజల్ , తమన్నా , చిరంజీవి , రామ్ చరణ్ తో . కాజల్  ,ఎన్టీఆర్ , బాలయ్య తో రకుల్ ప్రీత్ సింగ్ , నాగార్జున , నాగచైతన్యతో .. శ్రీదేవి , నాగేశ్వరరావు నాగర్జున‌తో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది ..


అయితే ఇంతమందితో సినిమాలు చేసిన అందులో ఎవరి సినిమాలు విజయాలు సాధించాయి .. తండ్రి కొడుకులు ఎవరి జోడి హిట్ .. మరి ముఖ్యంగా బాలయ్య , ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన ఓ హీరోయిన్ ఏ హీరోకు ఎలాంటి విజయాలు ఇచ్చిందో ఇక్కడ చూద్దాం. బాబాయ్ అబ్బాయిలు బాలయ్య , ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన ఓ హీరోయిన్ మాత్రం బాల‌య్య‌కు హిట్ ఇచ్చి ఎన్టీఆర్ కు మాత్రం భారీ షాక్ ఇచ్చింది .. ఇంతకీ ఆ హీరోయిన్  మరి ఎవరో కాదు స్టార్ బ్యూటీ శృతిహాసన్ .. ఇక ఈమె టాలీవుడ్ లో ఈమే యంగ్ హీరోలు సీనియర్ హీరోలు అనే బేధం లేకుండా అందరితో సినిమాలు చేసింది .. రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోలకు కూడా జంటగా నటించిన ఈ బ్యూటీ .. పవన్ కళ్యాణ్ ,బాలకృష్ణ ,చిరంజీవిలతో కూడా సినిమాలు చేసింది .

 

ఇక బాలయ్య , శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయింది .. గత సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .. అలాగే ఆ సంక్రాంతికి చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్యలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది . ఈ రెండు సినిమాలు హిట్ అయినా కూడా ఎక్కువ బాలయ్యకే సంక్రాంతి క్రెడిట్ వచ్చింది .. అలా బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన శృతిహాసన్ అటు ఎన్టీఆర్ కు మాత్రం డిజాస్టర్ సినిమా ఇచ్చింది .. రామయ్య వస్తావయ్య సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఎన్టీఆర్ కి జంటగా నటించింది శృతిహాసన్ .. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను హరీష్ శంకర్ తర్కెక్కించాడు .. రామయ్య వస్తావయ్య సినిమాకు ఫస్ట్ అఫ్ బాగున్నా. సెకండ్ ఆఫ్‌ రొటీన్ కథ‌తో చిరాకు తెప్పించింది . బాబాయ్ కి హిట్ ఇచ్చిన శృతిహాసన్ అబ్బాయికి మాత్రం కోల్కోలేని దెబ్బ కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: