తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టబోతున్నారు . త్వరలో రిలీజ్ కానున్న ఓ ప్రేమ కథ సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు .. ఈ సందర్భంగా జగ్గారెడ్డి నటిస్తున్న సినిమాకి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది .. అచ్చం అంఖ‌లో బాలయ్యల సీరియస్ లుక్ లో జగ్గారెడ్డి అదరగొట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్న జగ్గారెడ్డి . ప్రస్తుతం సినిమాల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది .


ఇక  ఈ క్రమంలోనే తాజాగా స్పందించి ఆయన నాకు సినిమా ఆఫర్ వచ్చింది ఓ లవ్ స్టోరీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాను .. ప్రేమికుల ప్రేమను కాపాడే గొప్ప నాయకుడిగా కనిపిస్తాను .. మాఫియాను ఎదిరించి ప్రేమను గెలిపించే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు . అంతేకాకుండా రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో కూడా నటిస్తానని ఆయన అన్నారు .. నన్నెవరూ రాజకీయం గా కిందకు తొక్క లేరు .. నా ఒరిజినల్ క్యారెక్టర్ ను ప్రేక్ష‌కులు సినిమా లో చూస్తారు ..


ఇక వచ్చే ఉగాది కి ఈ సినిమా స్టోరీ విని మళ్లీ ఉగాది కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను .. ముఖ్యమంత్రి పార్టీ నేతల అనుమతి తోనే సంవత్సరం పాటు సినిమా లో నటిస్తున్నాను అంటూ జగ్గారెడ్డి చెప్పకు వచ్చారు .. అలాగే ఈ సినిమా కు వద్ది రామానుజం ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు .. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి .. ఒక రాజకీయ నేతగా మాత్రమే కాకుండా ఇప్పుడు నటుడి గా కూడా తన టాలెంట్ చూపించబోతున్నాడు జగ్గారెడ్డి .. ఈ సీనియర్ నాయకుడు చిత్ర పరిశ్రమ లో తన నటనతో ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: