
ఎవరో ఒక బకరా దొరుకుతున్నారు సినిమా చేస్తున్నారు .. నష్టాలు అందుకుంటున్నారు .. సంవత్సరాల తరబడి హిట్ లేకపోయినా .. ఏళ్ళు తరబడి ప్లాప్‌లు వస్తున్న ఇంకా ఎందుకు సినిమా చేస్తున్నారో అర్థం కావటం లేదు .. ఎందుకు కొందరు ఏరుకోరి నష్టాలు కష్టాలు తెచ్చుకుంటున్నారు తెలియదు .. జనం ఈ లిస్టులో ఉన్న హీరోలని ఎప్పుడో పక్కన పెట్టేశారు అది గమనించకపోతే ఎలా ? శర్వానంద్ , గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమైంది ? సుధీర్ బాబు హిట్టు చూసి కూడా సంవత్సరాలు అవుతుంది ? ఇలా చాలామంది ఉన్నారు హిట్ చూసి , సరైన ఓపెనింగ్ చూసి .. ఇదే క్రమంలో పెద్ద హీరోలు కూడా హిట్ చూసి చాలా కాలం అయిపోయిన వారు కూడా ఉన్నారు.
రవితేజకు ధమాకా ముందు హిట్ లేదు .. ధమక తర్వాత కూడా హిట్ లేదు .. చేసిన ప్రతి సినిమాకు నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నారు .. అయినా పాతికోట్లు ఇచ్చి మరి సినిమా చేసే నిర్మాతలు ఉన్నారు . శర్వానంద్ 9 నుంచి 10 కోట్లు .. ఈయన సినిమాలకు ఓటీటీ అమ్మకాలు లేక సొంతంగా పే ఫర్ వ్యూ కింద విడుదల చేసుకోవాల్సిన పని వచ్చింది . గోపీచంద్ ఏడు కోట్ల వరకు తీసుకుంటున్నారు .. ఈ జాబితాలో కొందరు మెగా హీరోలు కూడా ఉన్నారు .. అయితే చిన్న హీరోలు కోటి ఆపై తీసుకుంటున్నారు .. వారు వారి లెవెల్లో నష్టాలు ఇస్తున్నరు నిర్మాతలకు .. కోట్లకు కోట్లు తీసుకుంటున్న వారు వారి లెవల్ లో నష్టాలు ఇస్తున్నారు .. నిర్మాతలు సినిమాలు తీస్తూనే ఉన్నారు .. తీస్తూనే ఉంటారు ఇదే ఇక్కడ అంతు చిక్కని మ్యాజిక్.