టాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు మారుతీ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ది రాజా సాబ్ అనే భారీ సినిమా తె రాబోతున్న విషయం తెలిసిందే . అయితే  ఈ సినిమా లో నీధి అగర్వాల్ ప్రభాస్ కు జంటగా నటిస్తుంది .. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజా సాబ్ సినిమా లో తన పాత్ర గురించి ఇంట్రెస్ట్ కామెంట్లు చేసింది ఈ బ్యూటీ .. హారర్ కామిడీ నేపథ్యం లో రానున్న ఈ సినిమాలో ఆమె దెయ్యం పాత్రలో నటించడం లేదు .. పూర్తి వినోదాత్మకం గా సాగే ఈ సినిమాలో ఆమె పాత్ర కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందట ..


అలాగే ప్రభాస్ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు .. షూటింగ్ సెట్లో అందరితో సరదాగా ఉంటారు .. అంటూ నిధి అగర్వాల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది . ఇక‌ ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు .. మాళవిక మోహనన్ ,  రిద్ధి కుమార్ హీరోయిన్ల గా నటిస్తున్నారు .. మ్యూజిక్ సన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నారు ..  ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి .. ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ పై ఇప్పటికే మూడున్నర గంటల సినిమా నిడివి ఉందని .. ప్రజెంట్ ఎడిటింగ్ భాగం ఆ నిడివి తగ్గించే పనిలో ఉందని తెలుస్తుంది .


 ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు కూడా ఉన్నాయి .. ఈ సినిమా రిలీజ్ డే విషయంలో మాత్రం ఎన్నో అనుమానాలు వస్తున్నాయి .. ఈ సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది .. అనుకోని కారణాల తో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది . అయితే ఇప్పుడు ఈ సినిమా దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని తాజా సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: