
అయితే ఎన్టీఆర్ ని కృష్ణ రాజకీయంగా వ్యతిరేకించేవారు .. 1983 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు .. ఆ సమయంలో ఎన్టీఆర్ రాజకీయ విధానాలు పాలన తీరుపై అసహనం వ్యక్తం చేశారు కృష్ణ .. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ పై పొలిటికల్ సర్టైరికల్ సినిమాలు కూడా తెరకెక్కించారు .. మండలధీశుడు, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి సినిమాల్లో ఎన్టీఆర్ ని కృష్ణ ఏకీపారేశారు .. ప్రధానంగా మండల ధీశుడు సినిమాలో ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రను కోటా శ్రీనివాసరావు నటించాడు . అలాగే ఎన్టీఆర్ పొలిటికల్ గెటప్ ని కూడా ఈ సినిమాలో అనుచరించారు .. ఇక దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు .. ఈ సినిమాలో నటించిన కోట శ్రీనివాసరావు పై దాడి కూడా చేశారు. అయితే ఎన్టీఆర్ కృష్ణ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అనే విషయం అప్పట్లో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు .. అలాగే వీరిద్దరి అభిమానుల మధ్య కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి .. ఈ పరిణామాలు నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా ఒక సభ జరిగింది .. ఇక సభకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు .. నాగేశ్వరావు తో పాటు చిత్ర పరిశ్రమ పెద్దలు ఈ సభలో పాల్గొన్నారు .
అయితే ఈ సభలో ఎన్టీఆర్ ను ఉద్దేశించి కృష్ణ మాట్లాడారు . అప్పటికే గొడవలు జరుగుతున్న సమయంలో కృష్ణ ఏం మాట్లాడుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది . అయితే కృష్ణ సింపుల్గా తన ప్రసంగాన్ని ముగించారు .. ఎన్టీఆర్ , ఏఎన్నార్లకు నమస్కారాలు చెప్పే కృష్ణ .. గత పది పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి త్వరలో వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. . అది పూర్తిస్థాయిలో జరగలేదు .. చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాలు తెలిసిన అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు .. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో హైదరాబాదుకు తెలుగు చిత్ర పరిశ్రమ రావాలని కోరుకుంటున్నాను అంటూ కృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు .. అయితే కొన్ని దశాబ్దాలు నాటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అలా అప్పటి హీరోల కృషి ఫలితంగానే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఇండస్ట్రీగా మారడానికి వారి ప్రయత్నం ఎంతో కారణమైంది.