పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో ఆడి పాడాడు. కానీ ఆయన కెరియర్ మొత్తంలో ఒక శృతి హాసన్ తో తప్పిస్తే ఏ హీరోయిన్ తో కూడా మూడు సినిమాల్లో నటించలేదు. పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబోలో మొదటగా గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో శృతి హాసన్ కు మొట్టబిమొదటి బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఆ తర్వాత వీరి కాంబోలో కాటమ రాయుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. వీరి కాంబినేషన్లో మూడవ సినిమాగా వాకిల్ సాబ్ అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వస్తే అందులో రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన మూవీలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసా ..? దాని గురించి తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ , కాటమ రాయుడు , వాకిలి సాబ్ ఈ మూడు సినిమాలు కూడా రీమిక్ మూవీలే. పవన్ , శృతి హాసన్ కాంబోలో మొదటగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ హిందీ సినిమా అయినటువంటి దబాంగ్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇక పవన్ , శృతి హాసన్ కాంబోలో వచ్చిన రెండవ సినిమా అయినటువంటి కాటమ రాయుడు మూవీ తమిళ మూవీ అయినటువంటి వీరం కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇక పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా వాకిల్ సబ్ హిందీ సినిమా అయినటువంటి పింక్ మూవీ కి రీమేక్ గా రూపొందింది. ఇలా వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా రీమేక్ మూవీలే. ఇలా పవన్ , శృతి హాసన్ కాంబోలో వచ్చిన ఈ మూడు మూవీలు కూడా రీమేక్ మూవీలే కావడం కామన్ పాయింట్.

మరింత సమాచారం తెలుసుకోండి: