మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.. అది కూడా మల్టీ స్టారర్ మూవీ కావడం విశేషం.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయట..
 
అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ కలిసి చేసే ఐకాన్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసారు..ఇద్దరూ కలిసి చేసే కీలకమైన పాట షూటింగ్ ఇటీవలే ముంబై యష్ రాజ్ స్టూడియోస్ లో ప్రారంభం అయింది..
అయితే దీని తాలూకు రిహార్సల్స్ జరుగుతుండగా హృతిక్ కాలు బెనకడం వల్ల డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. 51 ఏళ్ల వయసులో కుర్రాడిగా హృతిక్ స్టెప్స్ వేస్తారు. అయితే ఈసారి కొంచెం కష్టమైన స్టెప్పులకు సిద్ధమైన తరుణంలో ఇలా జరగడం అందరికి షాక్ కు గురి చేసింది.. దీనితో వార్ 2 చివరి పాట చిత్రీకరణ మేకర్స్ మేకి వాయిదా వేసినట్లు సమాచారం..

దీనితో సినిమా విడుదల తేదీ ఆగస్ట్ 14 లో ఎలాంటి మార్పు లేకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీ మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నట్టు సమాచారం...అయితే వార్ 2 కోసమే ఎన్టీఆర్  ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ అడుగు పెట్టలేదు. నీల్ మూవీ కోసం  ఎన్టీఆర్ మేకోవర్ మార్చుకోవాల్సి ఉంటుంది. వార్ 2 లుక్కుకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుందని సమాచారం... మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: