
తాజాగా ఈ రూమర్స్ పైన కోన వెంకట్ స్పందిస్తూ పలు విషయాలను వెల్లడించారు.. అంజలి పైన తనకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుందని. తనని ఒక చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా ఎలా పిలవమన్నా కూడా పిలుస్తానని తెలియజేశారు.. తన వ్యక్తిగత జీవితం చాలా మందికి తెలియకపోవచ్చు తన బాల్యం చాలా కఠినంగానే కొనసాగింది.. తన తల్లిదండ్రుల దగ్గర ఆమె ఎప్పుడు లేదు కేవలం తన పిన్ని దగ్గరే ఆమె పెరిగింది.ఆమె కూడా సరిగ్గా చూసుకునేది కాదు అంటూ తెలిపారు కోనా వెంకట్.
తనకు సపోర్ట్ గా ఒక వ్యక్తి ఉండాలని తన బాధలు చెప్పుకునేందుకు ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందనిపించింది.. తన కూతురికి ఎలాంటి ఇబ్బంది వస్తే ఎలా అండగా నిలబడతానో అలా అంజలీకి కూడా ఎల్లప్పుడూ అండగానే నిలుచున్నానని తెలిపారు.. వీటి పైన పలు రకాల ప్రచారాలు కూడా చేశారని తాను ఎప్పుడూ కూడా అలాంటివేవీ పట్టించుకోలేదని తెలిపారు కోన వెంకట్. గీతాంజలి సినిమా చేస్తున్న సమయంలో అంజలి పరిచయమయ్యిందని కానీ ఆ సమయంలో ఆమె చెన్నైలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది.. తన పిన్ని అంజలి యొక్క ఆస్తిని కూడా కాజేయాలని చూసింది.. ఆ సమయంలో ఆమెకు అండగా స్నేహితుడిగా నిలబడ్డానని తెలిపారు.. అలాగే తొలిసారిగా ఆమె బిఎండబ్ల్యూ కారు కొన్నప్పుడు తన చేతులు మీదుగా ఇవ్వమని అడిగిందని తెలిపారు. కానీ ఆమె కష్టపడి కొంటే తాను గిఫ్టుగా ఇచ్చనని రాసేసుకున్నారు అంటూ తెలిపారు కోన వెంకట్. అంజలి తనకు కూతురు లాంటిదని తెలిపారు.