గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ బిగ్గెస్ట్ సినిమాతో రాంచరణ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రొటిన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథ తో ఈ తెరకెక్కడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు..ఈ సినిమా ఫలితం రాంచరణ్ ని సైతం డిస్సపాయింట్ చేసింది..ఫ్యాన్స్ కి ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ మూవీ గిఫ్ట్ గా ఇవ్వాలని రామ్ చరణ్ తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తున్నాడు.

రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడు. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది...చిత్ర యూనిట్ ఇటీవల నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.ప్రస్తుతం Rc16 షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతుంది.గ్రాఫిక్స్ వర్క్స్ ఏమి లేకపోవడంతో షూటింగ్ ను దర్శకుడు బుచ్చిబాబు శరవేగంగా చేస్తున్నాడు...బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ దర్శకుడు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నాడు..

దర్శకుడు బుచ్చి బాబు కి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని చరణ్ చూస్తున్నట్లు సమాచారం..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: