టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి పాయల్ రాజ్ ఒకరు. ఈ చిన్నదాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న ఈ చిన్నది మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ సినిమాలో తనదైన నటన, అందం, గ్లామర్ తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.

ఆర్ఎక్స్ 100 సినిమా అనంతరం వెంకీ మామ సినిమాలోనూ ఈ చిన్నదాని నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. అయితే వన్ ఫిల్మ్ వండర్ లా ఆర్ఎక్స్ 100 సినిమా అనంతరం ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ఆర్డిఎక్స్ లవ్, డిస్కో రాజా, వెంకీ మామ, జిన్నా వంటి అనేక సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు. అనగనగా ఓ అతిథి, త్రీ రోజెస్ ఇలాంటి ఓటీటీ సినిమాలు, సిరీస్ లతో ఈ చిన్నది తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకు లేకపోయింది.

 కెరీర్ పరంగా కాస్త గందరగోళం కొనసాగుతున్న సమయంలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ ఈ బ్యూటీకి మరో సినిమాలో అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సినిమాయే మంగళవారం. గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో ఈ చిన్నది మంచి గుర్తింపును అందుకుంది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.


అయితే ఈ సినిమా అనంతరం పాయల్ కు సినిమా అవకాశాలు ఇస్తారని చెప్పి ఓ నిర్మాత మోసం చేశాడట. తాను చెప్పిన విధంగా చేస్తేనే సినిమాలలో అవకాశాలు ఇస్తానని లేకపోతే ఇకనుంచి ఎలాంటి సినిమాలలో నీకు అవకాశాలు రాకుండా చేస్తానని పాయల్ ను విపరీతంగా టార్చర్ పెడుతున్నాడట. అయితే పాయల్ ఆ నిర్మాత చెప్పినట్లుగా చేయడానికి ఒప్పుకోవడం లేదట. మరి పాయల్ కు సినిమా అవకాశాలు వస్తాయా లేదా అనే సందేహంలో కొంతమంది అభిమానులు ఉన్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: