టాలీవుడ్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఎంతో ద‌గ్గ‌ర‌య్యింది. అంతే కాకుండా నిధి కెరీర్ లో చెప్పుకోద‌గ్గ హిట్స్ లేక‌పోయినా కుర్రాళ్ల‌కు మాత్రం హాట్ ఫేవ‌రెట్ అయిపోయింది. మ‌త్తెక్కించే చూపుల‌తో డ‌స్కీ స్కిన్ టోన్ తో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే కుర్రాళ్ల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. ఇంకేముంది ఈ బ్యూటీ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఎక్క‌డికో వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ప‌లు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. 

వాటిలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేస్తున్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా, ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాలు కూడా ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్, ప్ర‌భాస్ ఇద్ద‌రూ స్టార్ హీరోలు. టాప్ ఒక‌టి రెండు స్థానాలు కాకుండా ఇద్ద‌రూ ఓ రేంజ్ ఉన్న హీరోలు. ఒకేసారి ఇలాంటి స్టార్స్ సినిమాల్లో అవ‌కాశాలు రావాలంటే మామూలు విష‌యం కాదు. పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన బ్యూటీలు కూడా వీరితో న‌టించాల‌ని క‌ల‌లు కంటారు. అలాంటి హీరోల‌తో నిధి అగ‌ర్వాల్ న‌టించే ఛాన్స్ అందుకుంది.

ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమాల గురించి నిధి అగ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాలో నిధి అగ‌ర్వాల్ దెయ్యం పాత్ర‌లో న‌టిస్తోంది అంటూ కొద్దిరోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఓ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలో నిధి పాత్ర‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు క్లారిటీ ఇచ్చింది. సినిమాలో తాను దెయ్యం పాత్ర‌లో న‌టించ‌డం లేద‌ని చెప్పింది. ముందుగానే దీనికి క్లారిటీ ఇవ్వాల‌నుకున్నాన‌ని త‌న పాత్ర ఖ‌చ్చితంగా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉంటుంద‌ని చెప్పింది. సెట్స్ లో ప్ర‌భాస్ ఎప్పుడూ న‌వ్విస్తూ అంద‌రితో స‌ర‌దాగా ఉంటాడ‌ని చెప్పింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వస్తున్నఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: