టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరటం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది. కెరటం సినిమా అనంతరం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ బ్యూటీ తనదైన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ రాణించింది.


దాదాపు స్టార్ హీరోలు అందరితో కలిసి సినిమాలలో నటించిన ఈ చిన్నది ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా రకుల్ కు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రకుల్ వ్యక్తిగత విషయానికి వస్తే.... ఈ చిన్నది సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది.


వివాహం తర్వాత కూడా ఈ చిన్నది సినిమాలలో నటిస్తూ బిజీగా సమయాన్ని గడుపుతోంది. వివాహం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ డోస్ ను విపరీతంగా పెంచేసింది. తన అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది.


దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ అమ్మడు సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకోగా అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన చాలా మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫోటోలలో రకుల్ ను చూసిన చాలా మంది ఈ బ్యూటీ తన ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకుందేమోనని కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: