టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో దర్శకుడు అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ రావిపూడి ఇప్పుడు తనదైన దర్శకత్వంతో ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అనిల్ రావిపూడి సినిమా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క సినీ అభిమాని ఎంతో ఆసక్తిగా చూస్తారు.

రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం అనిల్ తన తదుపరి సినిమాను మెగా మెగాస్టార్ చిరంజీవితో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా పూర్తి చేసి చిరంజీవికి వినిపించగా అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారట. అయితే ఈ సినిమాలో ప్రస్తుతం హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

 ఇక హీరోయిన్ ను సెలెక్ట్ చేసిన వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారట. అయితే ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సినీ ఇండస్ట్రీలో జోరుగా వైరల్ అవుతుంది. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబినేషన్లో తీయబోయే సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలను ఎంపిక చేశారట. దానికి ఊర్వశి కూడా ఓకే చెప్పిందట.

 అయితే ఊర్వశి స్పెషల్ సాంగ్ లో చేయడానికి రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అంతేకాకుండా స్పెషల్ సాంగ్ కోసం దాదాపు రూ. 20 కోట్లకు పైనే ఖర్చు చేసి ఈ పాటను డిజైన్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ రూమర్ వైరల్ అవుతుంది. ఇక ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: