ఏంటి రష్మిక మందన్నా మరో హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిందా..తన ఎదుగుదలకు అడ్డం పడుతుందనా..లేక మరేదైనా కారణమా.. ఇంతకీ రష్మిక మందన్నా ఏ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక మందన్నా ప్రస్తుతం నటించిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టరే.. మినిమం 500 కోట్ల క్లబ్లో చేరుతూ సంచలనం సృష్టిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరంటే రుక్మిణి వసంత్.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.అలాగే ఇప్పటికే రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి సినిమాతో క్రేజ్ సంపాదించింది. 

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకు రష్మిక  మందన్నా వార్నింగ్ ఇవ్వడం ఏంటని మీరందరూ అనుకోవచ్చు.అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్ధన్ అనే మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతుంది అనే రూమర్లు వినిపించాయి. దీంతో రష్మిక రుక్మిణికి కాల్ చేసి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ తో సినిమా నటించకూడదు అని వార్నింగ్ ఇచ్చినట్టు టాలీవుడ్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా సప్త సాగరాలు దాటి మూవీకి హీరోగా చేసిన రక్షిత్ శెట్టి రష్మిక మాజీ ప్రియుడు..

దాంతో రక్షిత్ శెట్టి కూడా రుక్మిణి వసంత్ ని విజయ్ దేవరకొండ తో నటించకూడదని చెప్పారట ఇక వీరిద్దరి మాటలు చెవిలో పెట్టుకున్న రుక్మిణి వసంత్ విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం వచ్చినా కూడా నేను నటించను అని రిజెక్ట్ చేసిందట.అలా కొత్త హీరోయిన్ వస్తే తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఎగిరేసుకుపోతారోనని రష్మిక మందన్నా రుక్మిణి వసంత్ కి వార్నింగ్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఉన్నది ఎంత నిజమో కానీ ప్రస్తుతం ఈ వార్త  మాత్రం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: