కొంతమంది వ్యక్తులు మరణించినా కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. అలా ప్రమాదంలో మరణించి కూడా ఇప్పటికీ ప్రజల నోళ్ళలో ప్రతిరోజు నానుతున్న హీరోయిన్ ఎవరయ్యా అంటే సౌందర్య.. ఈమె మరణం చాలా బాధాకరం, అలాంటి సౌందర్య ప్రమాదవశాత్తు హెలికాప్టర్ లో వెళ్తున్న సమయంలో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఎంతోమంది సౌందర్య అభిమానులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అలాంటి సౌందర్య గురించి ఇప్పటికి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా సౌందర్య మరణంపై ఒక సంచలన విషయం బయటకు వచ్చింది..

ఆమె ప్రమాదవశాత్తు మరణించలేదని, ఆ హీరో వల్లే మరణించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వివరాలు ఏంటో చూద్దామా.. సౌందర్య ఈమె నటనను మెచ్చని వారు ఉండరు. అద్భుతమైన రూపం, దానికి మించి నటన అభినయం ఈమె సొంతం. ఇండస్ట్రీలోకి   వచ్చిన కొంత కాలంలోనే స్టార్ హీరోలందరితో తెరను పంచుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ మరణంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశాడు. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కాకుండా హీరో మోహన్ బాబు వల్లే మరణించిందని ఆయన లేఖ ద్వారా తెలియజేశారు. అంతే కాదు మోహన్ బాబు వల్ల నాకు ప్రాణహాని కూడా ఉందని అన్నారు. 

ఆ లేఖలో ఉన్న దాని ప్రకారం సౌందర్య కు శంషాబాద్ జల్ పల్లిలో  భూమి ఉంది. అయితే ఈ భూమిపై మోహన్ బాబు కన్ను పడడంతో, అమ్మమని ఒత్తిడి చేశారట. కానీ సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ మేము అమ్మమని చెప్పి మోహన్ బాబుకు చెప్పడంతో, వీరిపై కక్ష పెంచుకున్న మోహన్ బాబు, ఒక పార్టీ ప్రచారం కోసం వెళ్తున్న సౌందర్యను హత్య చేసి చంపేశారని లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆ గెస్ట్ హౌస్ ను ఆక్రమించి తన పేరిట చేసుకున్నారని చిట్టిమల్లు తెలియజేశారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: