అక్కినేని నాగార్జున తోటి హీరోలకు ఎంత గౌరవం ఇస్తారో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి అక్కినేని నాగార్జుననే ఓ హీరో కాలర్ పట్టుకున్నారట. అది కూడా ఆయనకంటే వయసులో పెద్దవాడైన హీరో. మరి ఇంతకీ నాగార్జున ఎందుకు ఆ హీరో కాలర్ పట్టుకున్నారు.. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్నారట. మరి ఎందుకు పట్టుకున్నారంటే..నాగార్జున కృష్ణ కాంబినేషన్లో వారసుడు మూవీ వచ్చిన సంగతి ఆమెకు తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ సమయంలో పెద్ద రచ్చరచ్చ జరిగింది. అయితే మొదట్లో కృష్ణ నాగార్జునకు తండ్రి పాత్రలో నటించడానికి ససేమిరా అన్నారట. కానీ ఎంతోమంది ఒప్పించిన కూడా వినలేదట. ఇక చివరికి మురళీమోహన్ వెళ్లి స్వయంగా మీరు ఈ సినిమాలో నటించాల్సిందే అని చెప్పడంతో అందరూ అంతలా బ్రతిమిలాడుతుంటే ఎందుకు రిజెక్ట్ చేయడం అని సూపర్ స్టార్ కృష్ణ వారసుడు మూవీలో నాగార్జున తండ్రి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారట. 

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తిగా బాగున్నప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం రచ్చ జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో తండ్రి అంటే ఇష్టం లేని పాత్రలో నాగార్జున నటిస్తాడు.అలా తండ్రి పాత్రలో నటించిన కృష్ణని నాగార్జున పదేపదే అవమానించడం కృష్ణ ఫ్యాన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. ఇక వారసుడు సినిమా క్లైమాక్స్లో నాగార్జున తండ్రి పాత్రలో నటించిన కృష్ణ కాలర్ పట్టుకుంటారు. అయితే అంత పెద్ద హీరో కాలర్ పట్టుకోవడంతో కృష్ణ ఫ్యాన్స్ అందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేశారు. వయసులో పెద్దవాడైనా అలాగే స్టార్ హీరో కృష్ణని కాలర్ పట్టుకొని అవమానిస్తారా అంటూ కృష్ణ అభిమానులు అందరూ రాష్ట్రవ్యాప్తంగా రచ్చ రచ్చ చేశారు.

దాంతో నాగార్జున తో పాటు చిత్ర యూనిట్ కూడా కృష్ణకి కృష్ణ అభిమానులకి సారీ చెప్పడంతో పాటు నాగార్జున స్వయంగా బయటికి వచ్చి కృష్ణ అంటే నాకు అపారమైన అభిమానం. కానీ సినిమా షూటింగ్లో భాగంగానే అలా చేయాల్సి వచ్చింది. కాలర్ పట్టుకున్నందుకు మీరంతా తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ నాగార్జున అభిమానులకు సారీ చెప్పారు. దాంతో క్లైమాక్స్ మొత్తం రీ షూట్ చేసి మళ్లీ సినిమాని రిలీజ్ చేశారు. ఇక మళ్లీ రిలీజ్ చేశాక సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ కృష్ణ మాత్రం ఇక ఎప్పటికీ ఇలాంటి పాత్రలో నటించను అని తేల్చి చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: