శోభిత దూళిపాళ్ల మొదటి ప్రేమ అందరూ నాగచైతన్యనే అనుకుంటారు.కానీ నాగచైతన్య కంటే ముందే శోభిత ధూళిపాళ్ల మొదట ఓ బిజినెస్ మాన్ ని ప్రేమించింది. కానీ కొద్దిరోజుల డేటింగ్ చేసిన తర్వాత అభిప్రాయభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. అయితే వీరిద్దరూ కాకుండానే శోభిత ధూళిపాళ్ల మొదట ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించిందట. మరి ఇంతకీ శోభిత దూళిపాళ్ల ఫస్ట్ ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అతనితో ప్రేమని చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయింది అనేది ఇప్పుడు చూద్దాం.. శోభిత ధూళిపాళ్ల తన మొదటి ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఎందుకో ఏమో తెలియదు కానీ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నా సీనియర్ అంటే చాలా ఇష్టం ఉండేది. 

ఆయన్ని నా వైపు తిప్పుకోవడం కోసం చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఎన్నో ప్రయత్నాలు చేసి నాపై దృష్టి పడేలా చేసుకునేదాన్ని.కానీ అతనికి నా మీద ఎలాంటి ఇష్టం కూడా ఉండేది కాదు. అంతే కాదు నా మీద గుడ్ ఫీలింగ్ రావడం కోసం అతని కోసం ఎస్సే రైటింగ్ వంటి పోటీలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకునే దాన్ని. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. అలాగే కాలేజ్ డేస్ లో చదువుకున్న సమయంలో నాకు చాలానే లవ్ లెటర్స్ వచ్చాయి.అంతేకాదు నేను కూడా కొంతమందికి లవ్ లెటర్స్ రాసాను.

అలా కాలేజీ డేస్ లో ప్రేమించినప్పటికీ నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు.నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను పట్టించుకోకపోవడంతో నేను చాలా బాధపడేదాన్ని.ఆ తర్వాత మైండ్ మెచ్యూరిటీ రావడంతో ప్రేమంటే ఏంటి అనేది అర్థమైంది. దాంతో నా సీనియర్ మీద నాకున్నది క్రష్ ప్రేమో కూడా ఇప్పటికీ అర్థం కాదు అంటూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో శోభిత ధూళిపాళ్ల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి బయట పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: