పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గత కొంతకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”.. ఈ సినిమాను అనౌన్స్ చేసి కూడా దాదాపు ఐదేళ్లు కావస్తుంది....ఈ సినిమా తర్వాత పవన్ నటించిన 'భీమ్లా నాయక్,' ‘బ్రో’ సినిమాలు కూడా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతుంది.. కానీ “హరిహర వీరమల్లు “ సినిమా రిలీజ్ కు మాత్రం మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ.. సినిమా మాత్రం విడుదల కావట్లేదు.ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలెట్టిన ఉత్సాహంలో మేకర్స్ మార్చి 28 న రిలీజ్ డేట్ ప్రకటించారు..అయితే షూటింగ్ ఇంకా బ్యాలన్స్ వుండటంతో 'వీరమల్లు' సినిమా అనుకున్న డేట్ కి విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

మరోవైపు మార్చి 28కి పవన్ సినిమా రాదన్న ధీమాతో అదే డేట్‌ ను కన్ఫర్మ్ చేసుకొని రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు జోరుగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి..మార్చి 28న 'హరిహర వీరమల్లు' వస్తుందని నమ్మకంగా వున్న ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిలీజ్ పై ఆశలు వదులుకున్నారు... పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమాకు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది.. దీనితో ఈ సినిమా వాయిదా పడుతుందని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.ఐతే ఇప్పుడు రిలీజ్ వాయిదా పడితే  మళ్లీ ఎప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా అని ఫ్యాన్స్ మళ్ళీ ఆందోళన చెందుతున్నారు..

అయితే ఈ సినిమా సరికొత్త రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..మేకర్స్ ఈ సినిమాను మే 9 న విడుదల చేయాలని భావిస్తున్నారట.. అయితే అదే డేట్ కి మాస్ మహారాజ్ రవితేజమాస్ జాతర “.. నితిన్ “తమ్ముడు” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాయి.. పవన్ సినిమా రావడంతో ఆ రెండు సినిమాలు వాయిదా పడతాయని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: