టాలీవుడ్ లో కొంతమంది హీరోలు కొంతమంది నిర్మాతలు కొన్ని సినిమాలు తీయడం వల్ల చాలా రకాలుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో సినిమాలు తీయాలి అంటే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. కొంతమంది హీరోలు ఏళ్ల తరబడి డిజాస్టర్లు గా మూటకట్టుకుంటున్నప్పటికీ రెమ్యూనరేషన్ తగ్గించిన కూడా మరి లాసులే వస్తున్నాయట. చాలామంది మీడియం రేంజ్ హీరోలకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టే పరిస్థితి లేదట. ఇక ఓటిటీ డీల్స్ కూడా పెద్దగా రాకపోవడంతో చాలామంది ఈ హీరోలతో సినిమాలు చేయడానికి మక్కువ చూపలేదట.


అలా టాలీవుడ్ లో హీరోల జాబితా పెద్దగానే ఉంది. ముఖ్యంగా ప్రేక్షకులు కూడా ఈ హీరోలు సినిమాలు తీస్తే చూడాల్సిన పనిలేదు అన్నట్లుగా పక్కన పెట్టేసారట.. శర్వానంద్, సుధీర్ బాబు, గోపీచంద్ వంటి హీరోలు సరైన హిట్టు కొట్టక చాలా కాలం అవుతోంది. సరైన ఓపెనింగ్స్ కూడా చూసి చాలా కాలం అవుతున్నది. నిర్మాతలు మాత్రం భారీ బడ్జెట్ తోనే ఈ హీరోలతో సినిమాలు తీస్తూ కథ కంటెంట్ బాగున్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఫెయిల్యూర్ గా మిగులుతూ ఉన్నాయి.


ఇక రవితేజ కూడా ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ కూడా హిట్ కాలేదు. దీంతో నిర్మాతలకు కోట్ల రూపాయలు నష్టాన్ని మూటకట్టుకుంటున్నారు. రవితేజ రెమ్యూనరేషన్ కూడా 25 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.


గోపీచంద్ ఒక్క చిత్రానికి 7 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. రెమ్యూనరేషన్ చాలా తగ్గించినప్పటికీ కూడా కథపరంగా బాగున్న ఎందుకో లాభాలను గోపీచంద్ సినిమాలను రాబట్టలేకపోతున్నాయట


శర్వానంద్ ఒక్కో చిత్రానికి 10 కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉన్న ఓటీటి అమ్మకాలు లేక  ఈ హీరో సినిమాలు విడుదల చేయడానికి ఆలస్యం అవుతున్నాయట.


ఇక వేరే కాకుండా చాలామంది హీరోలు సైతం కోట్లకు కోట్లు నష్టాలను తీసుకువచ్చేలా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సినిమాలు తీస్తూనే ఉన్నారు. తీస్తూనే ఉంటామన్నట్టుగా చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: