ప్రస్తుతం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో  క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్లలో అర్జున్ రెడ్డి వంగ మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పవచ్చు.. అలాంటి ఈయన తీసింది చాలా తక్కువ సినిమాలు అయినా పేరు మాత్రం భారీగా సంపాదించి పెట్టుకున్నారు. అలాంటి సందీప్ రెడ్డి వంగ  ఏ చిత్రం చేసిన టేకింగ్, క్యారెక్టర్జేషన్ చాలా వినూత్నంగా ఉంటాయి. అలాంటి ఈయన అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమా కోసం వంగ పెద్ద సాహసమే చేశారట.. ఈ చిత్రంలో హీరోని వెతకడం కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి కూడా వచ్చిందట.. ఈయనను  నమ్మి నిర్మాతలు, హీరో దొరకడం కష్టంగా మారిందని తెలుసుకొని, చివరికి తానే నిర్మాతగా మారి సినిమాను తెరకెక్కించారు. 

ఈ చిత్రంలో అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నటువంటి విజయ్ దేవరకొండను హీరోగా ఎంచుకున్నాడు. తానే స్వయంగా సినిమాను 2.5 కోట్ల బడ్జెట్ పెట్టి తీశాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ముందుగా చూసినటువంటి కొంతమంది ప్రముఖులు  ఇందులో 10 నుంచి 20 నిమిషాల సినిమాను తొలగించు లేదంటే మూవీ ఫ్లాప్ అవుతుందని చెప్పారట. కానీ సందీప్ రెడ్డి వంగ మొండోడు, తాను అనుకున్నది కరెక్ట్ గా రీచ్ అయ్యేవరకు ఎవరి మాట వినడు. సినిమా అనేది నిడివి తగ్గించడం, పెంచడం వళ్లనో హిట్ అవ్వదని, సినిమా కథపరంగా బాగుంటే మనం ఏ పరిస్థితుల్లో విడుదల చేసిన హిట్ అవుతుందని తెలియజేసారట.

అర్జున్ రెడ్డి, ట్రెండ్ కు తగ్గట్టుగా విజయ్ దేవరకొండను కొత్తగా చూపించాడు. 2017 లో వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి విజయ్ దేవరకొండను కూడా ఒక స్టార్ ను చేసిందని చెప్పవచ్చు. ఇందులో విజయ్ సరసాన శాలిని పాండే నటన అత్యద్భుతం.. వీరిద్దరి కాంబినేషన్ ఈ చిత్రంలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి సినిమా సూపర్ హిట్ అయింది. ఒకవేళ ఇతరుల మాటలు నన్ను ఆ పది నుంచి 20 నిమిషాలు నిడివి తీసేసి ఉంటే సినిమా రిజల్ట్ మారేదేమో అని చాలామంది భావిస్తున్నారు.ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా కెరియర్ మారిపోయిందని, ఆయనను నమ్మి పెద్ద పెద్ద హీరోలే ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: