గత ఏడాది చివరిలో హాట్ టాపిక్ గా మారిన విషయం పుష్ప-2.. ఈ సినిమా బెనిఫిట్ షో సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కి రావడం అక్కడ తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ మరణించడమే కాకుండా ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా అక్కడ తొక్కిసలాటలో భాగంగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ కేసు అటు అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైన ఫైర్ కావడం జరిగింది. శ్రీ తేజ్ కు అవసరమైన సహాయాన్ని కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు చేయడం బెయిల్ మీద బయటకు రావడం వంటివి కూడా జరిగాయి. దీంతో అటు అల్లు కుటుంబం, చిత్రం బృందం కూడా శ్రీ తేజ్ సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటామంటూ తెలియజేశారు.


గత కొద్దిరోజులుగా శ్రీ తేజ్ ఆరోగ్యం పైన పలు బులిటేన్ విడుదల చేశారు వైద్యులు.. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ఎన్ని రోజుల తర్వాత శ్రీతేజ్ ఆరోగ్యం పైన  వైద్యులు తెలియజేశారు. ఇంకా శ్రీ తేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని మూడు నెలలుగా వైద్యం అందిస్తూ ఉన్నప్పటికీ నరాల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని వైద్యులు తెలియజేస్తున్నారట.. కేవలం కళ్ళు మూసి తెరుస్తున్నారని ఎవరిని గుర్తుపట్టట్లేదని వైద్యులకు తెలియజేస్తున్నారు.


శ్రీతేజ్ కు ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమి ప్రాసెస్లో ఫుడ్ అందిస్తున్నాం అన్నట్లుగా వైద్యులు తెలియజేస్తున్నారు. శ్రీ తేజ్ శరీర కదలిక కోసం రోజు ఫిజియోథెరపీ వంటివి కూడా చేయిస్తున్నామని వెల్లడించారు. మొత్తానికి శ్రీతేజ్ ఆరోగ్యం మాత్రం ఇంకా కుదుటపడలేదని వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. శ్రీ తేజ్ మెరుగైన వైద్యం కోసం ఇతర దేశాలకు తీసుకువెళ్లేలా కూడా ప్లాన్ చేస్తున్నారని గత కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పైన ఎక్కడ మరి వినిపించలేదు. మరి ఈ విషయం పైన అటు అల్లు కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: