పాపం పూజ హెగ్డే.. టైం మరీ మరీ దారుణంగా ఉంది . ఆమెను స్టార్స్ కూడా నమ్మించి మోసం చేస్తూ వస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో ఆమె అంటే పడి చచ్చిపోయిన హీరోలు డైరెక్టర్లు ఇప్పుడు పూజ హెగ్డే అంటే మండిపడిపోతున్నారు.  దానికి కారణం ఆమె క్రేజ్ పూర్తిగా పడిపోవడమే . ప్రజెంట్ పూజ హెగ్డే పేరు చెప్తే ఒక్కడంటే ఒక్కడు కూడా అరవడం లేదు .. కేకలు పెట్టడం లేదు . పూజ హెగ్డేను డమ్మీగా మార్చేశారు చాలామంది జనాలు . పూజా హెగ్డే నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడం.. ఆ తర్వాత డైరెక్టర్లు ఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడం  మానేశారు.


అదే బిగ్ రీజన్ గా మారిపోయింది . అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ పూజ హెగ్డే సినిమాలోకి వచ్చింది . కోలీవుడ్ లో రెండు .. తెలుగులో ఒక సినిమాకి కమిట్ అయ్యింది.  బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది . వీటి అన్నిటిలో సూర్య తో చేసే సినిమా హిట్ అవుతుంది అని నమ్మకం అందరికీ ఉంది . మిగతా సినిమాలపై ఎవరికి ఆ ఇంట్రెస్ట్ లేదు. అయితే తెలుగులో మాత్రం నాగచైతన్య - పూజ హెగ్డే కి అవకాశం ఇచ్చాడు అంటూ బాగా వార్తలు వినిపించాయి . పూజ హెగ్డే కి తెలుగు హీరోలు ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు.. అలాంటి మూమెంట్ లో నాగ చైతన్య ఆమెకు ఆఫర్ ఇవ్వడంతో పూజ హెగ్డే పాలిట నాగచైతన్య దేవుడిగా భావించరు.



అయితే ఇప్పుడు ఆయన కూడా ధ్యేయంలా మారిపోయాడు పూజ హెగ్డే ఫాన్స్ కి . దానికి కారణం "తండేల్" సినిమా హిట్ తర్వాత నాగచైతన్య క్రేజ్ మార్కెట్ పెరిగిపోవడమే. తండేల్ సినిమా సూపర్ డూపర్ హిట్టు అందుకున్న నాగచైతన్య ప్రజెంట్ బిగ్ ప్రాజెక్ట్స్ ని ఓకే చేస్తున్నారు.  ఈ క్రమంలోనే అంత పెద్ద హిట్ అందుకున్న నాగచైతన్య నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా ఫ్లాప్ హీరోయిన్ పూజ అని పెడితే బాగుండదు అంటూ మేకర్స్ భావిస్తున్నారట.  అందుకే విరుపాక్ష డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా నుండి పూజ హెగ్డే ని తప్పించారట . ఈ స్థానంలోకి అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా  వచ్చి చేరబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: