నటుడిగా , సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో జీ వి ప్రకాష్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాలకు కూడా సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈయన నితిన్ హీరో గా రూపొందిన రాబిన్ హుడ్ అనే తెలుగు సినిమాకు కూడా సంగీతం అందించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈయన అనేక తమిళ సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకొని నటుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా జీ వి ప్రకాష్ కుమార్ "కింగ్టన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు రావడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు ఈ సినిమాకు 25 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 30 లక్షల రేంజ్ లో , మూడవ రోజు 20 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల షేర్ ... 75 లక్షల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇలా ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: