
ఆమె మరి ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ రోజా . యస్ రోజా . ఈమె పర్సనల్గా మెగా ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అయిన పొలిటికల్ పరంగా మాత్రం కొంచెం టంగ్ స్లిప్ అయిన కామెంట్స్ చేసింది . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని పరోక్షంగా ఘాటుగానే ఏకేసింది . అదే మూమెంట్లో రామ్ చరణ్ నటించబోయే సినిమాలో ఆమెను తల్లి క్యారెక్టర్ లో చూపించాలి అంటూ ఒక స్టార్ డైరెక్టర్ ఆశపడ్డాడు. ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయాడు. అయితే రామ్ చరణ్ మాత్రం ఆమె సినిమాలో ఉంటే నేను అసలు నటించను అంటూ తెగేసి చెప్పేసాడట .
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలల పాటు ఆ సినిమా కోసం హోల్డ్ లో పెట్టారట రోజా ని కానీ రామ్ చరణ్ మాత్రం అస్సలు ఆమెను తన తల్లి క్యారెక్టర్లు చూపించడానికి ఒప్పుకోలేదట . దీంతో చేసేది ఏమీ లేక డైరెక్టర్ ఆమెను సినిమాలో నుంచి తప్పించి వేరే ఆమెను ఆ ప్లేస్ లోకి రీప్లేస్ చేశారట . ఆ సినిమా మరేంటో కాదు "గోవిందుడు అందరివాడేలే". డైరెక్టర్ కృష్ణవంశీ చరణ్ కోసం చాలా చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మరి రోజాని ఈ సినిమా నుంచి తప్పించాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ ప్లేస్ లో జయ సుధ ని పెట్టాడూ. ఈ సినిమా నీలి రంగు చీరలోనా పాట బాగా హిట్ అయ్యింది..!