సూపర్ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఎన్నో భాషల సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం అద్భుతమై క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత కొంత కాలానికే తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇక తెలుగు లో కూడా ఈ బ్యూటీ చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకుంది. తెలుగు మూవీ ల ద్వారా ఇండియా వ్యాప్తంగా ఈ బ్యూటీ కి క్రేజ్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈమెకు వరస పెట్టి హిందీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

దానితో ఈ బ్యూటీ ప్రస్తుతం అనేక భాషల సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ నటించిన పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల అయింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఛావా అనే సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చింది. మొదట హిందీ లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తాజాగా తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో కూడా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్న రష్మిక ఏం చదువుకుందో తెలుసా ..? రష్మిక ఏం చదువుకుంది ..? ఎక్కడ చదువుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

రష్మిక బెంగళూరులో ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ మరియు జర్నలిజం అలాగే వీటితో పాటు ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: