
అక్కినేని నాగేశ్వరరావు గారు ... అక్కినేని నాగార్జున .. అక్కినేని నాగచైతన్య .. అక్కినేని అఖిల్ .. అక్కినేని అమల అందరు కలిసి ఈ సినిమాలో నటించారు . అంతేనా అక్కినేని ఇంటి కోడలు కాకముందే ఈ సినిమాలో స్పెషల్ గా అక్కినేని ఫ్యామిలీలో ఒక పర్సన్ గా కనిపించేసింది సమంత . ఈ సినిమా తర్వాతే సమంత - నాగచైతన్య పెళ్లి జరిగింది . అప్పటికి వీళ్ళ ప్రేమాయణం పూర్తిగా కొనసాగుతూనే వచ్చింది. కానీ బయటపడడం మాత్రం ఆలస్యంగా జరిగింది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య - సమంత కెమిస్ట్రీ వేరే లెవల్ అని చెప్పాలి.
కానీ ఈ సినిమాలో సమంత ప్లేస్ లో ముందుగా కాజల్ అగర్వాల్ అనుకున్నారట . కానీ నాగచైతన్య నే పట్టుబట్టి ఈ క్యారెక్టర్ కోసం సమంతనే బాగుంటుంది అంటూ డైరెక్టర్ తో మాట్లాడి మరి ఈ రోల్ ని ఆమెకి వచ్చేలా చేసారట . ఫైనల్లీ ఈ క్యారెక్టర్ లో సమంత నటించలేదు..జీవించేసింది అని చెప్పాలి . ఎంత బాగా నటించిన ఏం లాభం.. రీల్ లైఫ్ లో బాగానే ఉన్నారు కానీ రియల్ లైఫ్ లో మాత్రం విడిపోయారు అంటున్నారు జనాలు . సమంత - నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నాగచైతన్య రెండో పెళ్లి చేసుకునేసాడు కూడా..!