సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా చాలా కామన్ మేటర్ . అది అందరికీ తెలిసిందే . కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అది చాలా పీక్స్ కి వెళ్ళిపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా హీరోస్ సీనియర్ హీరోస్ పాన్ ఇండియా హీరోస్ విషయంలో మాత్రం అభిమానులు అది అస్సలు ఈజీగా తీసుకోరు . సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరొక హీరో చేస్తూ ఉండటం మనం చూస్తూనే వస్తున్నాం. అయితే బిగ్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు వేరే హీరో ఖాతాలో పడిపోతే మాత్రం ముందు అనుకున్న హీరోకి కొంచెం బాధగా ఉంటుంది .


ఆ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ మ్యాటర్ విన్న ఆ సినిమాలకు సంబంధించిన పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉన్న "అరెరే మనం ఈ సినిమా చేసుంటే బాగుండేదే అని అనుకుంటూ ఉంటారు".  చిరంజీవి కూడా అలా అనుకున్న సిచువేషన్ ఉంది. అది కూడా నాగార్జున మూవీ విషయంలో . ఎస్ చిరంజీవిసినిమా విషయంలోనూ రాంగ్ స్టెప్ తీసుకోడు అని అంతా అనుకుంటారు . కానీ కొన్ని విషయాలలో అలా రాంగ్ స్టెప్ తీసుకొని బొక్క బోర్ల పడ్డాడు . మరీ ముఖ్యంగా నాగర్జున కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన , బంగార్రాజు సినిమాలలో ముందుగా హీరోగా నాగార్జున కాకుండా చిరంజీవిని అనుకున్నారట .



కానీ చిరంజీవి కొన్ని కొన్ని సీన్స్ నచ్చక ఈ సినిమా రిజెక్ట్ చేశారట . నిజానికి ఈ సినిమా సీనియర్ హీరోస్ కి బాగా సెట్ అయి ఉండేది . ఈ సినిమాలో హీరోగా ముందుగా నాగార్జున కాకుండా చిరంజీవిని అనుకోవడం .. డైరెక్టర్ ఇంటికి వెళ్లి చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగింది.  కానీ చిరంజీవి రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ చాలా చాలా అప్సెట్ అయ్యారట.  ఆ తర్వాత ఈ కథ కోసం ఫ్యామిలీ హీరో వెంకటేష్ ని కూడా అనుకున్నారట . ఆయన కూడా ఈ కథను రిజెక్ట్ చేసారట.  ఫైనల్లీ ఈ కథలోకి వచ్చాడు నాగార్జున . అనుకున్న విధంగానే సూపర్ సక్సెస్ అయ్యాడు . సోగ్గాడే చిన్నినాయన సినిమా రిలీజ్ అయిన తర్వాత బంగార్రాజు సినిమా రిలీజ్ అయింది . రెండు సినిమాలు కూడా మంచిగా నాగార్జున పేరుని డబుల్ క్రేజ్ దక్కించుకునేలా చేసాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: