స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సమంత రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ లో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు సమంత వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
 
సమంత నాగచైతన్య విడిపోయి దాదాపుగా నాలుగు సంవత్సరాలు కాగా సమంత చైతన్యకు వెనక్కు ఇవ్వని వస్తువులలో ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఒకటి. ఈ ఉంగరం 3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ కావడం గమనార్హం. సమంత తన ఎంగేజ్మెంట్ రింగ్ ను అందమైన పెండెంట్ గా మార్చుకుందని సమాచారం అందుతోంది. తన బంగారు గొలుసుకు ఆ పెండెంట్ ను ధరించి సమంత ఉపయోగించనుందని భోగట్టా.
 
అయితే సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి పూర్వ వైభవం సొంతం చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. వస్తువులను మార్చి వాడుకోవడాన్ని ఇష్టపడే సమంత గతంలో కూడా తన వస్తువులను మార్చడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే సమంత తన శరీరంపై ఉన్న టాటూను మాత్రం ఇప్పటివరకు తొలగించుకోక పోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
 
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం విజయాలను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. సమంత ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తూ తన రేంజ్ పెంచుకుంటున్నారు. తనపై వస్తున్న విమర్శలకు సైతం సమంత భవిష్యత్తులో సమాధానం కచ్చితంగా ఇస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న సమంత వెబ్ సిరీస్ లతో సైతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: