పుష్ప సినిమాకు ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటినుంచి ఈ సినిమాని దేశవ్యాప్తంగా ఎంతో మంది వైరల్ గా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పుష్ప 2 చిత్ర మరింత క్రేజ్ అందుకొని పలు రకాల రికార్డులను కూడా తిరగరాసింది. అయినప్పటికీ కూడా పుష్ప2 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ చిత్ర బృందానికి ఏవో ఒక ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి. అటు అల్లు అర్జున్ అరెస్ట్ నిర్మాతల పైన ఐటి రైట్స్ ఇలా ఏవో ఒకటి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. కోర్టుల కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమ్ ఇలాంటి సమయంలోనే హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.


పుష్ప 2 చిత్రానికి వచ్చిన లాభాలను జానపద కళాకారులకు సైతం పింఛనీ కోసం ఉపయోగించాలి అంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకి భారీగా లాభాలు వచ్చాయని ఈ విషయాన్ని నిర్మాతల స్వయంగా ప్రకటించారని ఆయన కోర్టుకు వివరించారు.. నిజానికి పుష్ప చిత్రానికి ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్ షోలు అధిక టికెట్టు ధరల వల్లే కారణమని తెలిపారు.


ప్రభుత్వ సహకారంతోనే ఇంతటి లాభాలను అందుకున్న పుష్ప 2 చిత్రానికి వచ్చిన లాభాలను సుప్రీం కోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారులకు పింఛనీ కోసం మళ్ళించాలంటూ లాయర్ నరసింహారావు పిటిషన్ వేశారట. ఎందుకు జానపద కళాకారులకు కూడా హక్కు ఉందంటూ నరసింహారావు వెల్లడించారు. కానీ ఆ లాభాలు ఎప్పుడో అయిపోయిందిగా అంటూ కోర్టు ప్రశ్నించగా దీనికోసం ఇప్పుడు ఫీల్ వేసినట్లు నరసింహారావు వెల్లడించారట. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సబ్మిట్ చేయడానికి రెండు వారాల దాకా గడువు అడిగారట. ఇప్పుడు ఈ విషయం పైన టాలీవుడ్ అంతట హాట్ టాపిక్ గా మారుతున్నది. ఇప్పటికే పుష్ప 2 సినిమా గురించి అందరూ కూడా వివాదాల విషయంలో మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ వాటాల గురించి ఫీల్ చేయడంతో మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: