
ప్రస్తుతం తెలుగులో ఆయనో టాప్ రైటర్. పారితోషికం గట్టిగానే తీసుకొంటున్నాడు. మాంచి ఫామ్‌లోనూ ఉన్నాడు.. ఆయన కామెడీ బాగా రాస్తాడన్న పేరుంది. అయితే ఆయనకు ఒకటే బ్యాడ్ హ్యాబిట్. లేడీస్ వీక్‌నెస్ బాగా ఉంది. అవకాశం కోసం ఎదరు చూసే అమ్మాయిలకు మా సినిమాలో వేషం ఇస్తాలెండి అంటూ బుట్టలో వేసుకోవడంలో ఆయన అరితేరిపోయారట. ఈ విషయం ఆ రైటర్ తో పని చేసే దర్శక నిర్మాతలకు బాగానే తెలుసు. కానీ భరిస్తున్నారు .. ఏం చేస్తారు తప్పడం లేదు. ఇప్పుడు ఆ రైటర్ ఓ సినిమా పనిలో తలమునకలై ఉన్నాడు. తన సినిమా అంటే సెట్లో రైటర్‌గా తాను ఉండాల్సిందే లేకపోతే సీరియస్ అవుతారు. అయితే ఆ సెట్లో ఉన్నవాడు ఖాళీగా ఉండకపోవడమే అసలు సమస్య.
తన సినిమాలో పని చేస్తున్న హీరోయిన్ గుడ్ లుక్స్ లో పడడానికి రకరకాల స్కెచ్‌లు వేస్తుంటాడు. ఉదయం సెట్లోకి రాగానే ‘ లంచ్‌లో ఏం కావాలి .. డిన్నర్‌లో స్పెషల్ ఏం తెప్పించమంటారు ’ అంటూ అచ్చంగా ప్రొడక్షన్ బాయ్‌లా బిహేవ్ చేస్తున్నాడట. హీరోయిన్ ఏం అడిగినా, కాదనకుండా దగ్గరుండీ మరీ తీసుకొస్తున్నాడట. అయితే..ఈ ఖర్చంతా నిర్మాతే భరించాల్సివస్తోందట. దీంతో నిర్మాతలు కక్కలేక మింగలేక చందంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ రైటర్ చేస్తున్న ఓవరాక్షన్ చూసి మిగిలిన వాళ్లు నవ్వుకొంటున్నారని, సెట్లో ఇదే హాట్ టాపిక్ అయ్యిందని టాలీవుడ్ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి.
పోనీ ఆ దర్శకుడు కూడా నువ్వు ఆఫీసుసలో ఉండి రాసుకో ఇక్కడ .. సెట్లోకి ఎందుకు అని చెపుదామంటే ఆ డైరెక్టర్ కు ఆ రైటరే లెఫ్టు .. రైటు కావడంతో ఏం అనలేక పోతున్నాడట. ఏదేమైనా ఆ రైటర్ గారి లేడీస్ వీక్‌నెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.