
- జబర్దస్త్ , ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి కి గ్రీన్ సిగ్నల్
- క్రేజీ కాంబినేషన్ పై టాలీవుడ్ లో ఆసక్తి
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ... స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత ఆమె చేసిన సినిమా లు ఏవీ ఆమె కు కలిసి రావడం లేదు. యశోద జస్ట్ యావరేజ్ . . ఇక శాకుంతలం సినిమా అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక సిటాడెల్ వెబ్ సీరిస్ కూడా దానిమీద ఉన్న అంచనాల తో పోలిస్తే ఓ మోస్తరు గానే ఆకట్టుకుంది. ఇక సమంత అటు సౌత్ తో పాటు నార్త్‌లో నూ బిజీగా ఉంది . ఇప్పుడు టాలీవుడ్‌లో మరోసారి సమంత ఓ సినిమాతో ప్రేక్షకు ల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు పై అంచనాలు మామూలుగా లేవు.
గతంలో జబర్దస్త్ , ఓ బేబీ లాంటి సినిమా లను డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నందిని రెడ్డి సమంతకు ఓ కథను వినిపించగా, దానికి సామ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. సామ్ - నందిని రెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సమంత కోసం నందిని రెడ్డి ఎలాంటి ? కథను తీసుకొస్తారా అనేది కూడా టాలీవుడ్ సినీ వర్గాల లో ఆసక్తికరంగా మారింది. ఇక తమ అభిమాన హీరోయిన్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించనుందని తెలిసి సమంత అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు.