
ఇక తమ కుటుంబానికి విలేజ్ బాక్ డ్రాప్ సినిమాలు కలిసి వస్తాయని అఖిల్ కి కూడా అలాంటి సినిమా కావాలని ఎప్పటినుంచో చూస్తున్నానని చెప్పి ఈ సినిమాను తన సొంత బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు నాగార్జున . ఇక ఈ సినిమా ఈనెల 14న హైదరాబాదులో మొదలు కాబోతుంది .. ఎక్కువ భాగం షూటింగ్ కూడా చిత్తూరు జిల్లాలో జరగబోతుంది .. అలాగే ఈ సినిమాలో చిత్తూరు మాట పలుకుబడి కూడా ఉంటుందట .. చిత్తూరు ప్రాంతంలోని భారతం మెట్ట అనే ఒక కొండ ప్రాంతం ఉంది .. అక్కడ ఎక్కువ షూటింగ్ ఉండబోతుంది .
ఇక నాగార్జున నిర్మాతగా అఖిల్ కోసం చేస్తున్న రెండో సినిమా ఇది .. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు .. అఖిల్ హీరోగా ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు .. కానీ ఒకటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా హిట్ కాలేదు .. ఇక మరి ఈ సినిమాతో అయినా ఈ అక్కినేని హీరో హిట్ అందుకుంటానని గట్టి నమ్మకంతో ఉన్నారు .. యువి క్రియేషన్స్ కూడా అఖిల కోసం ఓ పోస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి ఉంచింది .. ఈ సినిమాలతో అయినా ఈ అక్కినేని హీరో తానేంటో చూపించుకుంటాడో లేదో చూడాలి ..