ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే ఎలా ఉండబోతుంది ? 2000 కోట్ల రేంజ్ లో ఉంటుందా .. ఉండాలి డబ్బులు విషయం అలా ఉంచితే సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి .. సందీప్ వంగా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తే ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటాడు .  యానిమల్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు .. దాని తర్వాత ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ హిట్ అయితే సందీప్ క్రేజ్ ఊహించని లెవ‌లో ఉంటుంది.  అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది .. ఈ క్రమంలోని దర్శకుడు సందీప్ వంగా హీరో ప్రభాస్ కు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది ..
 

అలాగే కొన్ని డిమాండ్లు ప్రభాస్ ముందు ఉంచినట్టు కూడా సమాచారం . అందులో మొదటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా జూన్ నుంచి మొదలుపెట్టాలని కోరినట్లు తెలిసింది .. అలాగే సందీప్ వంగా బౌన్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు .  అందువల్ల జూన్ నుంచి మొదలుపెడితే  వచ్చే సంక్రాంతిని గట్టిగా టార్గెట్ చేయవచ్చు అనేది సందీప్ ప్లాన్ గా తెలుస్తుంది . ఇక మరో డిమాండ్ ఏమిటంటే కంటిన్యూగా 65 రోజులు కాల్ షీట్లు ఇవ్వాలన్నది పెద్ద డిమాండ్ .. ఎక్కడ బ్రేక్స్ లేకుండా ప్రభాస్ 65 రోజులు కాల్షియెట్లు ఇస్తే చకచక సినిమాను పూర్తి చేయాలనేది సందీప్ రెడ్డి మాస్టర్ ప్లానింగ్ .. ఇక్కడ మరో డిమాండ్ కాస్త కొంత విచిత్రంగా అనిపిస్తుంది .  



ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్లో మాదిరిగా తెలుగులో కూడా బాడీ డబుల్ లేదా డూప్ సంస్కృతి బాగా పెరిగింది .. లాంగ్ షాట్లు బ్యాక్ షాట్లు క్లోజ్డ్ మిగిలిన షాట్లు ఎక్కువగా బాడీ డబల్స్ తో చేస్తున్నారు దీనికి ఏ హీరో కూడా పెద్దగా మినహాయింపుగా లేరు .. అయితే తన సినిమాకు బాడీ డబుల్స్‌ అన్నది కుదరదు అని సందీప్ రెడ్డి వంగ ముందే ప్రభాస్ కు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది .. సినిమా మొత్తం షార్టులో అన్ని హీరోనే డైరెక్టర్గా చేయాలనేది సందీప్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది .. ఇలా మొత్తానికి సందీప్ తన సినిమాను ఎక్కడ ఎలాంటి ఆటంకాలు రాకుండా ఫుల్ ప్రాపర్ గా  పర్ఫెక్ట్ గా తీసుకురావడానికి డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: