
ఇలాంటి సమయంలోనే హీరో హృతిక్ రోషన్ గాయపడినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సాంగ్ రిహార్ సెల్ చేస్తూ ఉండగా.. హృతిక్ రోషన్ గాయపడ్డట్టుగా సమాచారం. వార్ 2 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్య కూడా డాన్స్ వార్ ఉంటుందట. రిహార్సల్ చేస్తున్న సమయంలో ప్రతి గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే చిత్ర బృందం హుటాహుటిగా హృతిక్ రోషన్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లారట. సుమారుగా 30 రోజులకు పైగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఈ విషయం బాలీవుడ్ అంతట వైరల్ గా మారుతున్నది.
దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి హృతిక్ రోషన్ కి గాయాలు అయినట్లుగా అభిమానులకు తెలియడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ విషయం పైన సరైన విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తుందేమో చూడాలి మరి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది. ఎన్టీఆర్ కూడా ఇందులో నెగిటివ్ షెడ్డు ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.