
ఈ సినిమా లో విలన్ క్యారెక్టర్ చేస్తున్న పృథ్వీరాజ్ ఓ కుర్చీలో కూర్చుంటాడు .. అతని ఎదురుగా మహేష్ నించుంటాడు .. అక్కడ ఆర్మీ ఆఫీసర్గా ఉన్న ఒక వ్యక్తి వచ్చి మహేష్ ను ముందుకు తోస్తే విలన్ ముందు మోకాళ్ళ పై కూర్చుంటాడు మహేష్ .. సరిగ్గా ఇక్కడే విలన్ కూర్చున్న కూర్చి అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది .. సరిగ్గా అది ఎక్స్ - మెన్ సిరీస్ సినిమాలో ఒక వ్యక్తి ఇదే కుర్చీలో కూర్చుంటాడు .. ఆ సినిమాలో మాత్రమే కాదు మరెన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కూడా ఇదే తరహా కుర్చీ ఉంటుంది .
అలాంటి కుర్చీని విలన్ కోసం వాడుతున్నారంటే కచ్చితంగా మహేష్ సినిమాలో కూడా సైన్స్ ఫిక్షన్ కాస్త ఉంటుందని మీడియా లో డౌట్ మొదలైంది .. ఈ సినిమా మొదలు పెట్టిన విషయమే రాజమౌళి బయటకు చెప్పలేదు .. అలాంటిది ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని అతను బయటపెడతారు అనుకోవటం కూడా అత్యాసే అవుతుంది .. ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఈ వారంలో ఓ ప్రెస్ మీట్ ఉంటుందని అంతా అనుకున్నారు .. కానీ రాజమౌళి , మహేష్ తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు .. వచ్చే వారం నుంచి మరింత బిజీ కాబోతున్నారని తెలుస్తుంది .