
ఈ మూడు షరతుల విషయంలో ప్రభాస్ నిర్ణయం ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని షూటింగ్ శరవేగంగా జరిగే విధంగా సందీప్ రెడ్డి వంగా ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల రేంజ్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ తన లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ ఏకంగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ లుక్ లో కనిపించనున్నారు.
ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదనే సంగతి తెలిసిందే. స్పిరిట్ సినిమా ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంది. స్పిరిట్ సినిమా కథ, కథనంలో ఊహించని స్థాయిలో ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.