
అయితే ఇదే సమయంలో అల్లు అర్జున్ వీలైనంత త్వరగా ఓ సినిమా చేసి 2026 లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట . అలాగే అలా ప్లాన్ చేసే సినిమా మొదలుపెట్టి కొంత వర్క్ చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టాలన్నది బన్నీ ఆలోచన అన్నట్టు ఓ వార్తా బయటకు వచ్చింది .. ఈ క్రమంలోని తనకోసం ఒక ఆరు నెలలు వెయిట్ చేయాలని త్రివిక్రమ్ ను అల్లు అర్జున్ కోరినట్టు టాలీవుడ్ విశ్వసినీయ వర్గాల సమాచారం .. ఇక దీనికి త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది . సమాంతరంగా చేసే అవకాశం ఉంటే వెయిట్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని త్రివిక్రమ్ కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది ..
అలాకాకుండా మొత్తం వేరే సినిమా చేసిన తర్వాత తన సినిమా మొదలు పెట్టాలంటే చాలా టైం పడుతుందని త్రివిక్రమ్ చెప్పినట్టు తెలుస్తుంది . ఒక సినిమా మొదలుపెట్టి కొంత పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టాలన్నది అల్లు అర్జున్ ఆలోచన .. ఇలా మొత్తం మీద త్రివిక్రమ్ ఇప్పుడు ఎటు వెళ్లడం లేదు అల్లు అర్జున్ సినిమా మీదే అల్లు అర్జున్ సినిమా కోసమే .. భారీ మైథలాజికల్ టచ్ ప్రాజెక్టును ఫైనల్ చేసుకుంటూ .. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తూ వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు.