మలయాళ సూపర్ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన సినిమా మార్కో. ఫుల్ వైలెంట్ యాక్షన్ జానర్ లో దర్శకుడు హనీఫ్ మార్కో సినిమాను తెరకెక్కించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం మార్కో సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.


అయితే మార్కో సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇవ్వబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన మార్కో సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయింది. అయితే ఈ సినిమాలో వైలెంట్ సీన్స్ చూసి ప్రేక్షకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో భయంకరమైన వైలెన్స్ ఉందని కొంతమంది వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మరి కొంతమంది హింస ఎలా ఉన్నప్పటికీ సినిమా మాత్రం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.


అయితే ఇదే విషయంపైన తాజాగా టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం స్పందించారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. నా భార్యతో కలిసి మార్కో సినిమాకు వెళ్లానని కిరణ్ అబ్బవరం చెప్పాడు. కానీ నా భార్య ప్రెగ్నెంట్. సెకండ్ హాఫ్ సమయంలో ఈ సినిమాను అసలు చూడలేకపోయాం.


నా భార్య ఈ సినిమాను చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీల్ అయింది. అందువల్ల ఈ సినిమా చూడకుండానే బయటికి వచ్చేసాం అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు. మలయాళ చరిత్రలో అత్యంత హింసాత్మక సినిమాగా మార్కో చిత్రం నిలిచింది. కాగా, ఈ సినిమాకు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: