గతకొంతకాలంగా సినిమా టిక్కెట్ల రేట్లు సామాన్యులకు అందుబాటులో లేవనీ అందువల్లనే పైరసీ పెరిగిపోతోంది అంటూ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాల నిర్మాణ వ్యయం  పెరిగిపోవడంతోపాటు ఓటీటీ లు పైరసీల ప్రభావంతో సినిమాల కలక్షన్స్ రోజురోజుకీ తగ్గిపోతున్నాయని అందువల్ల టిక్కెట్ రేటు పెంచకుండా ఇండస్ట్రీ వర్గాలు వాదిస్తున్నాయి.

ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే కర్ణాటక ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల పై తీసుకున్న నిర్ణయం. టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కొత్త భయాలను సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం లేటెస్ట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సినిమా టికెట్ ధరలను గరిష్టంగా 200 రూపాయలకు పరిమితం చేస్తూ చేసిన ప్రతిపాదన శాండల్ వుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. సింగిల్ స్క్రీన్ మల్టీ ప్లెక్స్ భేదం లేకుండా అందరికి ఇది వర్తిస్తుందట.

సినిమా టిక్కెట్ ఎట్టి పరిస్థితులలోను ఏధియేటర్ లోనూ 200 రూపాయలు మించకూడదని కర్ణాటక నిర్ణయం. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు తమిళం ఇలా భాషాభేదం లేకుండా అన్ని చిత్రాలకు ఇది వర్తిస్తుందని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తెలియ చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న మల్టీప్లెక్సులు ప్యాన్ ఇండియా మూవీస్ రిలీజైన సమయంలో 600 రూపాయలు టికెట్ రేటు పెట్టడంతో భారీ సినిమాలకు విపరీతంగా కలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మన భారీ తెలుగు సినిమాలకు కూడ సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంది.

ఈమధ్య బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి కన్నడ సెలబ్రిటీలు రావడం లేదన్న అసంతృప్తితో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్మలాను మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ అనుసరిస్తే రానున్న రోజులలో ఇండస్ట్రీకి మరిన్ని కష్టాలు తప్పవు అంటూ అభిప్రాయ పడుతున్నారు. దీనితో పరిస్థితి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది..    




మరింత సమాచారం తెలుసుకోండి: