టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా , ఇందులో శ్రీ లీల తన అందాలతో , డ్యాన్స్ తో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది.

ఇప్పటి వరకు ఈమె చాలా తెలుగు సినిమాల్లో నటించిన విజయాలు మాత్రం పెద్ద ఎత్తున దక్కలేదు. ఇలా కెరియర్ ను ప్రారంభించిన కొత్తలోనే ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఈ నటి అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటికి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ అయినటువంటి అనుష్క , కాజల్ , సమంత కూడా కెరియర్ పిక్స్ లో ఉండగా స్పెషల్ సాంగ్ లలో నటించారు. కానీ వీరు ముగ్గురు కూడా కేవలం ఒకే ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. శ్రీ లీలా కూడా ఇప్పటి వరకు తన కెరియర్లో ఒకే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. మరి ఈ ముగ్గురు హీరోయిన్లను ఫాలో అయ్యి ఈ బ్యూటీ కూడా ఒకే ఒక స్పెషల్ సాంగ్ తోనే వాటికి దూరంగా ఉంటుందా లేదా మళ్లీ స్పెషల్ సాంగ్స్ చేస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: