టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె కళ్యాణ్ రామ్ హీరో గా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తక్కువ సమయం లోనే మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అలా ఎదిగిన తర్వాత ఈమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

వరుస పెట్టి ఈమెకు స్టార్ హీరోలా సినిమాలలో , క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈమె అనేక సంవత్సరాలు పాటు తెలుగు లో తిరుగు లేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో సీనియర్ హీరోలతో సినిమాలు చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జునతో కాజల్ అగర్వాల్ కి రెండు సార్లు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం నాగార్జున "రగడ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క , ప్రియమణి హీరోయిన్లుగా నటించారు.

మూవీ లో ప్రియమణి స్థానంలో కాజల్ ను మొదట మేకర్స్ అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో కాజల్ నటించలేదట. ఇక నాగార్జున హీరోగా రూపొందిన ది ఘోస్ట్ మూవీ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించింది. మొదట సోనాల్ పాత్ర కోసం మేకర్స్ కాజల్ ను అనుకున్నారట. ఆల్మోస్ట్ అంతా సెట్ అయ్యాక కొన్ని కారణాల వల్ల కాజల్సినిమా నుండి తప్పుకుందట. అలా రెండు సార్లు నాగార్జున , కాజల్ కాంబోలో మూవీ మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: