మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీవార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఎన్టీఆర్ మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “ డ్రాగన్“.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభం అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూనే కమర్షియల్ యాడ్స్ లో సైతం నటిస్తున్నాడు.. ఇటీవల ఎన్టీఆర్ నటించిన zepto సంస్థ యాడ్ రీసెంట్ గా రిలీజ్ అయి బాగా ట్రెండ్ అవుతుంది.. అయితే ఆ యాడ్ లో ఎన్టీఆర్ లుక్ గురించి తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి.. చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేసారు..

 అయితే ఆ లుక్ కేవలం ఆ యాడ్ కోసమే అని తెలుస్తుంది.. తాజాగా ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించాడు.. ఎన్టీఆర్ లైట్ బియర్డ్,స్టైలిష్ హెయిర్ స్టైల్ తో గాగుల్స్ పెట్టుకొని ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ గా మారింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ చేసేవారు నోటి మీద వేలు వేసుకునేలా ఈ లుక్ ని తెగ షేర్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: