
కాగా రీసెంట్గా "అన్షు"(మన్మధుడు మూవీ హీరోయిన్).. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . మన్మధుడు సినిమాతో తన లెవెల్ నే మార్చేసుకునే రేంజ్ లో ఎదిగిపోతుంది అని ఆశపడ్డ అన్షు.. తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది . అయితే అన్షు తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. ఒకటి రాఘవేంద్ర మరోకటి మన్మధుడు . రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. వీళ్ళ మధ్య వచ్చిన సీన్స్ బాగా ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటాయి .
కాగా అన్షు రీసెంట్ గానే "మజాకా" సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఇప్పుడు అన్షు తెలుగు సినిమాలలో ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇదే మూమెంట్లో అన్షు "ఫౌజి" సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది . హను రాఘవ పూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ తల్లి పాత్ర కోసం అన్షూ ను చూస్ చేసుకున్నారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఒకప్పుడు ప్రభాస్ తో నటించిన ఆ బ్యూటీ ఇప్పుడు తల్లి క్యారెక్టర్ లో ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయ్ అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!