సినిమా ఇండస్ట్రీ లో విజయాలు అనేవి ఎంతో కీలకం. ఎవరికైతే మంచి విజయాలు దక్కుతూ ఉంటాయో వారు అద్భుతమైన స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతూ ఉంటారు. ఇక విజయాలు లేనట్లయితే వారి ఎదుగుదల అంత గొప్పగా ఉండదు. అందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ లో విజయాలు అనేవి హీరోయిన్లకు కూడా అత్యంత కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఎవరికి అయితే వరుస పెట్టి విజయాలు దక్కుతూ ఉంటాయో వారికి క్రేజీ సినిమాల్లో , స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కడం , అలాంటి వారు అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం కూడా జరుగుతూ ఉంటుంది.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా వరుస విజయాలను అందుకున్న ఓ ముద్దు గుమ్మకు మాత్రం వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం లేదు. ఆమె ఎవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి సంయుక్త మీనన్. ఈ బ్యూటీ భీమ్లా నాయక్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని , మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ నటి బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలతో వరుస పెట్టి విజయాలను అందుకుంది.

ఈమె ఆఖరుగా నటించిన డెవిల్ మూవీ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇలా ఇప్పటి వరకు ఈమె ఐదు తెలుగు సినిమాల్లో నటిస్తే అందులో నాలుగు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇలా ఈ నటి వరుస పెట్టి అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: